325 Views
ముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): బిఆర్ఎస్ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ముస్తాబాద్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సంతోష్ రావు, గుర్రాల రమేష్ రెడ్డి, గూడూరు భరత్, చెవుల మల్లేష్ యాదవ్, కొండా శ్రీనివాస్ గౌడ్, కనమేని శ్రీనివాస్ రెడ్డి, కుక్కల దేవేందర్, పిట్ల విఠ్ఠల్, తదితర బిఆర్ఎస్ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ రావు, రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లు అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కే.టి.రామారావు అధిక మెజార్టీతో గెలుపొందాలని కోరారు.

No Slide Found In Slider.
Poll not found