తెలంగాణ రాష్ట ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాయపోల్ మండల స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయితీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నోటీసు బోర్డులో పెట్టడం జరిగింది. వాటిపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుపుటకు కోరడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ బాలయ్య, ఎంపీవో శ్రీనివాస్, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజా గౌడ్, బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు సత్యం, నవీన్ గౌడ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




