ముస్తాబాద్/అక్టోబర్/22; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం రాజీవ్ గాంధీ కూడలి ప్రధాన రహదారి వెంబడి బీజేవైఎం బిజెపి ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమంలొ భాగంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేశారు.. ఈ సందర్భంగా పోలీసులకు బిజెవైఏం బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. డిగ్రీ కాలేజీ హామీఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థానిక మంత్రి కేటీఆర్ ఎన్నిసార్లు విన్నవించినా సమస్యను పక్కదారిన పెట్టి విద్యార్థులు పక్కజిల్లాలో అభ్యసిస్తున్న విషయాన్ని గమనించకుండా సమస్యలను గాలికి వదిలేశారని ఈసందర్భంగా బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో బిజెపి బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కస్తూరికార్తీక్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుడుకల జనార్ధన్, బిజెపి అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, దళిత మోర్చ మండల అధ్యక్షుడు తిరుపతి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోలా కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి బాద్ నరేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శులు పెంజర్ల కళ్యాణ్, కిట్టు, బిజెపి పట్టణ అధ్యక్షుడు మహేందర్, శేకర్, బండ సతీష్ శ్రీనివాస రావు, ఏల్లగిరిధర్ రెడ్డి బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
