
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16(TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండల కేంద్రంలోని పర్యవేక్షణ భవనం లో నాయి బ్రాహ్మణ దినోత్సవం సందర్బంగా మండల ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు బింగి మల్లేశం నాయి బ్రాహ్మణులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల నాయి బ్రాహ్మణ అధ్యక్షులు వెంకటయ్య, జగదేవపూర్ గ్రామ అధ్యక్షులు సిరిసిల్ల హరిప్రసాద్, నాయి బ్రాహ్మణ సభ్యులు కనయ్య, మహేందర్, విజ్ఞాన్, నవీన్, చిన్న వెంకటయ్య తదితరులు ఉన్నారు.




