మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో పాల్గొన్నారు.
తర్వాత తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నవంబర్ 30 వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఏ పార్టీ తరఫున డబ్బులు ఇచ్చిన తీసుకొని హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గడ్డం వివేక్ వెంకటస్వామి నీ గెలిపించాలని చెన్నూరు నియోజకవర్గ ప్రజలను తీన్మార్ మల్లన్న కోరారు.
