సిద్దిపేట జిల్లా నవంబర్ 28
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణ గౌడ్ విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది.అని అన్నారు
