రాజకీయం

పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బి అర్ ఎస్ లో చేరికలు.

214 Views

పాలకుర్తి నవంబర్ 1 :పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బి అర్ ఎస్ లో చేరికలు.

గులాబీ కండువాలు కప్పు పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామం గుట్ట కింది తండా కి చెందిన బంజారా నాయకులు 10 మంది, లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సమ్మన్న, సోమయ్య, యాదగిరి తదితరులు, తొర్రూరు మండలం, కంఠయపాలెం గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు, తొర్రూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డ్ దుబ్బ తండాకి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు భూక్యా మోహన్, సీతారాం ఆధ్వర్యంలో 10 మంది, 6వ వార్డుకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్యా దినేష్ ఆధ్వర్యంలో 10 మంది, మహిళ లీడర్లు భూక్యా బన్నీ ఆధ్వర్యంలో 10 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరగా, వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బి అర్ ఎస్ విజయం కోసం పని చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత వారి వారి గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *