రాజకీయం

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది

291 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8)

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.
—యశోద ఆస్పత్రి వైద్యులు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు.

ఆపరేషన్‌ చేసి తుంటి ఎముక రీప్లేస్‌ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధినేత ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలోని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *