ప్రాంతీయం

విద్యార్థులు ఆంగ్ల వాక్యాలు ధారాళంగా చదివేలా చూడాలి

105 Views

మన ఊరు-మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

– మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టే పనులకు నిధుల కొరత లేదు

– పనులు పూర్తి కాగానే వెంటనే డబ్బులు చెల్లిస్తాం

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల 21, అక్టోబర్ 2022:
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆంగ్ల వాక్యాలు ధారాళంగా చదివేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉపాధ్యాయులకు సూచించారు.
శుక్రవారం చందుర్తి మండలంలోని
జోగాపూర్ mpps, మూఢ పల్లి mpps స్కూల్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
పుస్తకాలలోని తెలుగు, ఆంగ్ల ప్యా సేజీల లను చదివించారు. తెలుగులో బాగా చదివిన విద్యార్థులు ఆంగ్ల ప్యాసింజర్లు చదవడంలో పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఆంగ్ల ప్యాసేజులను కూడా ధారాళంగా విద్యార్థిని చదివేల వారిని సన్నద్ధం చేయాలన్నారు. గణిత చతుర్వేధ ప్రక్రియలు విద్యార్థులు సులభంగా చేసేలా వారిని తీర్చి దిద్దాలనీ చెప్పారు.
అలాగే జోగాపూర్ mpps, మూఢపల్లి ZPHS లో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను పరిశీలించారు.
ఎలక్ట్రికల్ రిపేర్, డ్రింకింగ్ వాటర్, డైనింగ్ హాల్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనీ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. మన ఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు నిధుల కొరత లేదని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్ , సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ విద్యాసాగర్, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7