కోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేసిన పీపి లను అభినందించిన ఎస్పీ*
*విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు:*
*జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ *
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ…. పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. SC/ST కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.కోర్టులో నేరస్తులకు శిక్ష పడటం భాధితులకు న్యాయం చేయడం ద్వారా బాధితులకు పోలీసులు, కోర్టులపై నమ్మకం, గౌరవం పెరుగుతుందని. ముఖ్యంగా కోర్టులో కేసులు వీగిపోకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూడాల్సి వుంటుందని.బాధిత కుటుంబాలకు న్యాయం అందించే విషయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంలో పనిచేయాల్సి వుంటుందని అన్నారు..
వివిధ తరహా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకుగాను కోర్టులో సమర్పించాల్సిన సాక్ష్యాధారాలపై పోలీసు అధికారులకు వున్న సందేహాలకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీ ప్రసాద్ అసిస్టెంట్ సెషన్ కోర్ట్ సిరిసిల్ల వివరణ ఇచ్చారు.అనంతరం జిల్లా పరిధిలోని పలు కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడటంలో వాదనలు వినిపించడంలో ప్రతిభ కనబరిచిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీ ప్రసాద్,TPP నర్సింగరావు ,AGP రవీందర్రావు,APP సతీష్ కుమార్,APP విక్రాంత్,AGP సదానందం లను మెమోంటోస్ అందజేసి శాలువాతో సత్కరిచి అభినందించారు..
ఫంక్షనల్ వర్టికల్స్ ఉత్తమ ప్రతిభను కనబరిచిన అదికారులకు మరియు సిబ్బందికి రివార్డ్ లు…..
ఈ సందర్బంగా విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన,తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ ఉత్తమ ప్రతిభను కనబరిచిన 15 మoది అదికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ ప్రశంశ పత్రాలు అందజేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు విశ్వప్రసాద్, రవికుమార్, సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, మోగిలి,వెంకటేష్, బన్సీలాల్, శ్రీలత, సర్వర్, నవీన్ కుమార్,ఆర్.ఐ లు రజినీకాంత్,యాదగిరి ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…
