ప్రాంతీయం

ఉచిత నేత్ర వైద్య శిబిరం

121 Views

గర్మిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం.

32 మంది కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రికి తరలింపు  రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు గరిమెళ్ళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు మంచిర్యాలలోని నారాయణ హైస్కూల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ తెలిపారు.

మంచిర్యాల జిల్లాలోని వివిధ గ్రామాల నుండి 150 మంది వచ్చి తమ పేరును నమోదు చేసుకున్నారు. బిపి, షుగర్ పరీక్షల అనంతరం 60 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించారు అని నేత్ర వైద్యులు డాక్టర్ అభిషేక్ మరియు నేత్ర నిపుణులు సిహెచ్ ప్రభాకర్ తెలిపారు.

రేకుర్తి ఆసుపత్రి వారి గైడ్లైన్స్ ప్రకారము నేడు 30 మందిని రేకుర్తి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో 30 మందిని రెండవ విడతగా పంపించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమము విజయవంతం కావడం పట్ల లైన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వెంకటేశ్వర్, రీజియన్ చైర్ పర్సన్ లయన్ సుగుణాకర్ రెడ్డి,జోన్ చైర్ పర్సన్ లయన్ సద్దెనపు రామచందర్, జిల్లా కోఆర్డినేటర్ లయన్ శ్రీరామోజు రమేష్ బాబు, కార్యదర్శి లయన్ సిహెచ్ రాఘవేంద్రరావు కోశాధికారి లయన్ బళ్ళు శంకర్ లింగం,సభ్యులు లయన్ అంకులు, లయన్ వేముల ప్రవీణ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల సిబ్బంది అపర్ణ, శ్రీనివాస్, అజయ్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *