ప్రాంతీయం

*పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేని*

147 Views

17వ బెటాలియన్ కమాండంట్ కె.సుబ్రమణ్యం

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీస్ ఫ్లాగ్ డే)సందర్భంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో కమాండెంట్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు అవసరమైతే ప్రాణదానం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ దోరణిలో సంఘ విద్రోహక శక్తులు హింసలకు పాల్పడుతున్నాయని.. ఇలాంటి శక్తుల్ని ఎదుర్కొంటూ ఎందరో పోలీసు సోదరులు వీరమరణం పొందారన్నారు. పోలీసుల అమరత్వం నుంచి స్ఫూర్తిని, ప్రేరణ పొందుతున్నామన్నారు.పోలీసు అంటేనే పట్టుదల, ఓర్పు, సహనమని శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదన్నారు.
పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా బెటాలియన్ కార్యాలయంలో ఈ రోజు పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని ఇందులో భాగంగా ఏ.ఆర్.యస్.ఐ మరియు క్రింది స్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి అనే అంశంపై మరియు ఎస్.ఐ స్థాయి మరియు పై స్థాయి అధికారులకు..సమర్ధవంతమైన పోలీసింగ్ లో మహిళ పోలీస్ ల పాత్ర అనే అంశంపై పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలను నిర్వహించామని..ఈ పోటీలలో మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారికి బహుమతులు అందజేయటం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ యమ్.పార్థసారథి రెడ్డి , సర్దాపూర్ 9వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శైలజ , అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found