గజ్వెల్ నవంబర్ 18:బాధిత కుటుంబానికి సన్న బియ్యం అందజేత.
గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల ఎల్లేష్.
జగదేవపూర్ మండలంలోని పలుకు గడ్డ గ్రామానికి చెందిన లోకుల మల్లయ్య వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు, విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల ఎల్లేష్ బాధిత కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం ఆ కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి బాధిత కుటుంబానికి నా వంతు సహాకారాలు ఎప్పుడు అందజేస్తానని తెలిపారు.
మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే ఆనందం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ పెద్దమనిషి ఇస్తారి ,కోలకాడు రామచంద్రం, గ్రామస్తులు రమేష్ ,ఇస్తరి,ప్రవీణ్, రాజు, నారాయణ, సురేష్, కృష్ణ, ఊశయ్య, మల్లేశం, సాయిలు, తదితులున్నారు.