సెప్టెంబర్ 29
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాగణపతి నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకుని గురువారం నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు ఆర్యవైశ్య సంఘం నాయకులు,యువకులు,చిన్నారులు, మహిళలు, ఏకరూప వస్త్రధారణతో కోలాటం, భజనలు కీర్తనలు పాటలు ఆలపించారు ప్రజలు కన్నుల పండుగగా తిలకించారు, పూర్తి సాంప్రదాయబద్ధంగా ఏకరూప వస్త్రధారణతో పురవీధుల గుండా గణనాధున్ని ఊరేగింపు నిర్వహించారు
