ముస్తాబాద్, నవంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి) పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజుతో పాటు పలువురు మాట్లాడుతూ ఇచ్చిన హామీలే నెరవేర్చలే మళ్ళా ఓట్లు ఎట్లా అడుగుతారని ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలని అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో బాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను పలకరించి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6గ్యారంటీల పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం గజ్జలరాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు వేయాలి ప్రజల్ని మోసం చేసినందుకు ఓటు వేయాలా.. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గృహలక్ష్మి , బీసీలకు బీసీ బంద్ అంటూ కాగితాలు పంచుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. దళిత సిఎంను, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిండా, అర్హులు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిండా ఇలాపోతే అన్నిఅబద్ధాల మాటలే మొన్నటికి మొన్న అకాల వర్షం కారణంగా వరి పంటలు నష్టం జరిగితే కేటీఆర్ వచ్చి రైతులను ఓదార్చి నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఇచ్చిండా ఇవన్నీ మాటల బిఆర్ఎస్ ప్రజల్ని మోసం
చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు మరోసారి బయలుదేరారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్‌ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూం ఇళ్లు, గృహలక్ష్మీ ఇళ్లు అంటూ కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలు పెట్టి జై అనుకుంటా లేనిపోని ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, ప్రజలెవరూ మళ్ళీ మోసవద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మీఓటుతో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి తొలి సంతకం ఆరు గ్యారెంటీ ల మీద చేస్తాం అంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
