(మానకొండూర్ నవంబర్ 18)
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులైన వారిపై చిదంబరం చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు దరువు ఎల్లన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎల్లన్న మాట్లాడుతూ తెలంగాణ బలిదానాలకు మాకు సంబంధం లేదని చిదంబరం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీమాంధ్రల మోచేతి నీళ్లు తాగి తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడ్డది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అని అన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రకటన వచ్చిందని, ఆ ప్రకటన ఇలా వచ్చిందో మీకు తెలవదా అని, తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలను చూసి చలించిన కేసీఆర్ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 1952లో ఏడుగురు 1969లో 369 మంది విద్యార్థులను బలి తీసుకున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చిదంబరాన్ని మీడియా ముఖంగా ప్రశ్నించారు.
డిసెంబర్ 9న ప్రకటన తర్వాత ప్రజలు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో డిసెంబర్ 23 ప్రకటన ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేవలం కొంతమంది ప్రాణాలు పోయాయని మాట్లాడడం ఎంత అవమానకరమని, జై తెలంగాణ అంటూ యువత ఒక ఆశయం కోసం లక్ష్యం కోసం ఉద్యమం చేసి ప్రాణ త్యాగాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేయడం వల్లే అని, అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నాయకులు చెప్పుకుంటున్నారని ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ ఉద్యమం వలన తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు.
సమాఖ్య వాదుల సంకనాకి చంద్రబాబుతో జతకట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే వేసే విధంగా పనిచేసిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే అన్నారు. ఢిల్లీలో ఓ మాట గల్లీలో ఓ మాట మాట్లాడి నంగనాచిలా ప్రవర్తించింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవాలనుకున్నారని వారి అడుగులకు మడుగులు ఒత్తింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనని చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదని అన్నారు. తెలంగాణ రాకముందు ఎలా ఉండేదో అలాంటి పరిస్థితి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని రాష్ట్రం ఇప్పుడిప్పుడే దారికి వస్తున్న సందర్భంలో తెలంగాణను పీక్కతిన్న గద్దలకు అధికారం ఇవ్వకుండాఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.