మర్కుక్ మండలంలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల ప్రచారం.
పాములపర్తి గ్రామం నుండి బారి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు
ఎంపీపీ పాండు గౌడ్
నవంబర్ 17
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామం నుండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మర్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్ తో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో మర్కుక్ బయలుదేరారు.వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ విజయంతో గెలుపిస్తరని ధీమా వ్యక్తంచేశారు.
మర్కుక్ మండల్ ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.కెసిఆర్ ను గెలిపిస్తే రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తారని,కౌలు రైతులకు భూమిలేని నిరుపేదలకు ఐదు లక్షల బీమా సదుపాయం కల్పిస్తారని, మరెన్నో ప్రజలకు మేలు చేసే పథకాలు తీసుకువస్తారని, ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండు గౌడ్,మర్కుక్ మండల్ బిసి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య,మాజీ నాచారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ హరి పంతులు, మర్కుక్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ,బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మహేష్,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
