Breaking News

ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలం

137 Views

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలం

– ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్

సెప్టెంబర్ 27

సిద్దిపేట జిల్లా  చేర్యాల : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ అన్నారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన మహా సభలకు మండల అధ్యక్షులు బొజ్జ బాలక్రిష్ణ గౌడ్ అధ్యక్షతన వహించగా ఈ సభకు ముఖ్యఅతిథిగా శంకర్ హాజరై మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అమలు చేస్తామని, ప్రభుత్వ శాఖలలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి రాగానే హామీలను తుంగలో తొక్కినారని విమర్శించారు.

రానున్న ఎన్నికలలో నిరుద్యోగుల చేతిలో బిఆర్ఏస్ ప్రభుత్వం పతనం ఖాయమని మండిపడ్డారు. నిరుద్యోగుల హక్కులును పాలక ప్రభుత్వలు కాలరస్తున్నాయని, యువత పెద్ద పెద్ద చదువులు చదివి, ఇక్కడ ఉపాధి లేక విదేశాలకు కూలీలుగా వాలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడం లేదని, దీని మూలంగా ఉపాధి లేని నిరుద్యోగ యువత ఆత్మహత్య లు చేసునకుంటున్నారని అన్నారు. నిరుద్యోగ యువత కు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో యువత చేతిలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు.

అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఏఐవైఎఫ్ నాయకులు గూడెపు సుదర్శన్, కోడిపల్లి రాజు, గుజ్జుక రమేష్, తుమ్మల ప్రభాస్, బుద్ధిని వంశీ, గణేష్, రాజు, మల్లేష్, కనకయ్య, సిద్ధులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *