సిద్దిపేట జిల్లా నవంబర్ 17
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
బట్టు అంజిరెడ్డి క్రియేషన్స్ పతాకంపై,హీరో అనిల్ మొగిలి ముఖ్య పాత్రలో, బట్టు అంజి రెడ్డి నిర్మాతగా, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ సహనిర్మాతగా, చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల నరేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, డాక్యుమెంటరీ లఘు చిత్రం శపథం బాలా కల్లెపు దర్శకత్వం వహించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో శుక్రవారం శపథం డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్ లోగో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ఆవిష్కరించారు .ఈ సందర్భంగా బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడాలని ,ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని, కారుకే ఓటు వేయాల్సిన అవసరం ఏంటి అన్న విషయాన్ని ఈ శపథం డాక్యుమెంటరీలో ఉంటుందని .ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత దశాబ్ద కాలం నాటి తెలంగాణ దుస్థితిని తెలుసుకోవాలని, ఇప్పుడున్న అభివృద్ధిని గ్రహించాలని… వారి స్వలాభం కోసం రాజకీయ, జీవితం కోసం ప్రజలను వంచించి మోసం చేసే వారికి గుణపాఠం చెప్పి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసింది ఎవరు అని అర్థం చేసుకునే రీతిలో యువతలో మార్పు వచ్చే రీతిలో ఈ శపథం డాక్యుమెంటరీ ఉంటుందని తెలియజేశారు.అలాగే హీరో అనిల్ మాట్లాడుతూ అతి త్వరలో శపథం విడియో రిలీజ్ అవుతుందని కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో దుంబాల లింగారెడ్డి, ఏనుగు రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కో-డైరెక్టర్ శేఖర్, సినీ దర్శకులు మహేష్ తేజ్ తదితరులు పాల్గొన్నారు
