ప్రాంతీయం

సిరిసిల్ల లో డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం లోల్లి*

131 Views

కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో

చురకలు ప్రతినిధి సిరిసిల్ల పిబ్రవరి 13 :

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ‘డబుల్‌ బెడ్రూం’ ఇళ్ల కేటా యింపు లొల్లికి దారితీసింది. సిరిసిల్లలో నాలుగు ప్రాంతాల్లో 2,052 డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. 2,767 మంది అర్హులు ఉన్నారు. దీంతో ఇళ్లు రాని 963 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల వద్ద మున్సిపల్‌ కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారని కొందరు ఆరోపణలు చేశారు.
దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా.. బాధితులు శుక్రవారం ఆందోళన నిర్వ హించారు. సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలో పాదయాత్ర చేశారు. అనంతరం కలెక్టర్‌ ఎదుట రెండుగంటలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల డ్రాలోనూ కొందరు అనర్హులకు దక్కాయని వారు ఆరోపించారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7