మంచిర్యాల మనుషులు మంచి మనసు గలవారని, అలిగిన గులిగిన మనోడు మనోడే అని కారు గుర్తుకే ఓటు వేసి మంచిర్యాల శాసనసభ్యుడిగా దివాకర్ రావు గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, జిల్లా పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఉన్నారు.
రెవెన్యూ డివిజన్ గా ఉన్న మంచిర్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాగా అభివృద్ధి చేశారని అన్నారు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానని వందల మందిని పొట్టన పెట్టుకుందని అన్నారు. కరెంటు కష్టాల గురించి కాంగ్రెస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదని మంత్రి కేటీఆర్ ఎదవ చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మంచిర్యాలలో ఐటి హబ్ ఏర్పాటు చేస్తామని, గోదావరి వరద నీరు కాలనీలలో చేరకుండా కరకట్టలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఒక కేసీఆర్ను ఎదుర్కొనేందుకు దేశంలోని పెద్ద పెద్ద నేతలు రాష్ట్రానికి దిగుతున్నారని, అయినా మేము వాళ్లకు భయపడమని అన్నారు. మేం రాష్ట్ర ప్రజలను నమ్ముకున్నాం, కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఢిల్లీ నేతల చేతులు పెట్టద్దని, రాష్ట్రం ఆగమవుతుందని, లేదంటే రాబందుల చేతులలో పడి చావండి అని మంత్రి రోడ్ షోలో అన్నారు.
