24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 17)
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ రామగుండం నియోజక వర్గ అభ్యర్థి కి మద్దతుగా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆద్వర్యంలో శుక్రవారం బి ఆర్ ఎస్ న్యాయవాదులు ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ గోదావరిఖని మున్సిఫ్ కోర్ట్ నుంచి ప్రారంభం ఆయి ఖని ప్రధాన చౌరస్తా -5 ఇంక్లైన్ చౌరస్తా- విఠల్ నగర్ – తిలక్ నగర్ చౌరస్తా- రమేశ్ నగర్ చౌరస్తా-ఉల్లిగడ్డల బజార్-కళ్యాణనగర్ లక్ష్మీనగర్ -వి కె రెడ్డి చౌరస్తా -కోర్ట్ పైలాన్ -రాజేష్ థియేటర్ -మున్సిపల్ కార్యాలయం వరకు చేరింది.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.అనంతరం ఈ ర్యాలీ ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ మీడియల్ సెంటర్ వరకు నిర్వహించారు.ఈ సందర్భం గా పలువురు నాయకులు మాట్లాడుతూ నాటి సమైక్య ఆంధ్రా ప్రదేశ్ అడుగడుగున అణచివేతకు గురైన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం గా సాదించి అనేక హక్కులను సాధించిన ఘనత బి ఆర్ ఎస్ దే అన్నారు.రెండు సార్లు అధికారం లో కి వచ్చిన బి ఆర్ ఎస్ ఆద్వర్యం లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ,పెన్సన్ ల పెంపు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ సష్య సమలం చేసిన ఘనత సి ఎం కె సి ఆర్ దేనన్నారు.60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ అధోగతి పాలైందన్నారు.రానున్న ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్ది కోరుకంటి చందర్ ను అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ లీగల్ సెల్ నాయకులు జవ్వాజి శ్రీనివాస్ రకం దామోదర్ ఎరుకల ప్రదీప్ కుమార్ ముచ్చకుర్తి కుమార్ కొప్పుల నరేష్ ఏంచర్ల మహేష్ బాస అనూరాధ చెలికల పద్మజ బోయిన శ్రీనివాస్ ఇరుగురాలా మహేందర్ బోయిన శ్రీనివాస్ పులిపాక ప్రవీణ్ కుమార్ రాజకుమార్ మెండే శ్రీధర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
