భగత్ సింగ్ విగ్రహ స్థలం పై స్టే ఇచ్చిన హైకోర్టు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వెల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ స్థలంలో ఎలాంటి ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది. తదనంతరం భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు కానుగుల రమనకర్ మరియు కెతోజి వినోద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరయోధుడు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన భగత్ సింగ్ విగ్రహ నిర్మాణం IOC వద్ద ‘T` చౌరస్తాలో నిర్మించడం మున్సిపల్ నుండి అనుమతులు ఇచ్చినప్పటికీ గద్దె నిర్మాణం చేపట్టిన అనంతరం మునిసిపల్ అధికారులు కూల్చివేయడం జరిగింది. ఇది ముమ్మాటికీ భగతసింగ్ ని అవమానించారని మున్సిపల్ పాలకవర్గం మరియు మున్సిపల్ కమిషనర్ కుమ్మకై కక్ష పూరితంగా అక్కడ వేరే నిర్మాణం చేపడమనడం ముమ్మాటికీ దేశద్రోహ చర్యే అని తెలుపడం జరిగింది. తదనంతరం BSP జిల్లా ఉపాధ్యక్షుడు ఓంప్రకాశ్ మాట్లాడుతూ ఇప్పటికయినా భగత్ సింగ్ విగ్రహ నిర్మాణం అధికారికంగా చేపట్టాలని లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మునిసిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ పాలకవర్గం మరియు కమిషనర్ గద్దెను కూల్చివేయడం భారత జాతిని అగౌరవపరిచారని చరిత్రలో దేశద్రోహులుగా నిలుస్తారని తెలిపారు.BJP గజ్వెల్ నియోజకవర్గ కన్వీనర్ సురేష్ మరియు BJYM జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ BRS మున్సిపల్ కమిషనర్ మరియు పాలకవర్గం ప్రాణ త్యాగం చేసిన మహానియులను విగ్రహాలను వారి ఆలోచనలను ఆశయాలను ప్రజలకు చేరవేయకుండా అడ్డుకుంటున్నారని పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణలో బానిసత్వ మనస్తత్వంతో కూడిన పాలకవర్గం ఉందని పొరటయోధులను కించపరిచే ఆలోచనలు విరమించి ముందుకు వచ్చి భగత్ సింగ్ విగ్రహ నిర్మాణం చేపట్టాలని కోరారు మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు మన్నె కృపానందం,యమ్ ఆర్ పి యస్ నాయకుడు ముండ్రాతి కృష్ణ లు మాట్లాడుతూ హై కోర్టు ఆర్డర్ ఇవ్వడం బి ఆర్ యస్ నాయకులకు చెంప పెట్టు అని ఇప్పటికైనా అహంకారాన్ని వదిలి భగత్ సింగ్ విగ్రహా నిర్మాణాలో సహకరించాలని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో బి యస్ పి నాయకులు నరేష్, కర్ణాకర్, మహేందర్, ప్రసాద్,బి జె పి నాయకులు ఆర్ కే యాదవ్,వెంకటేష్, కర్ణాకర్ ,యమ్ ఆర్ పి యస్ నాయకులు ఆంజనేయులు, రమేష్,యువజన సంఘాల నాయకులు విజయ్, గోపాల్, స్వామి, సుధీర్, మాలమహానాడు నాయకులు నరేశ్,మురళి, స్వామి,విద్యార్థి సంఘం నాయకులు గిరి,గౌతమ్, సంపత్ విగ్రహ కమిటీ సభ్యులు ఓంకార్, సునీల్ , మహేష్, నవీన్, రాజు, నరేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
