పామర్రు నవంబర్ 14:వృద్దురాలి ప్రాణాలను కాపాడిన పామర్రు ఏఎస్‌ఐ దుర్గరావు.
ఏఎస్ఐ దుర్గారావు ధైర్యసాహసాలు అభినందనీయం.
పామర్రు చిన్న వంతెన మీద నుండి ఎవరో వృద్దురాలు కాలవ లోకి దూకినట్ట్లు రాబడిన సమాచారం మేరకు పామర్రు స్టేషన్ డ్యూటిలో వున్న ఏఎస్‌ఐ దుర్గారావు హుటాహుటిన సంఘటన స్తలానికి చేరుకోగా అప్పటికే ఆమె కాలవ నీటి ప్రవాహం లో కొట్టుకు పోతుండగా, ఏఎస్‌ఐ ఆమెని వెంబడించి నీటి ప్రవాహం లో కొట్టుకు పోతున్న ఆమెను రక్షించారు.
_సదరు వృద్దురాలు కనుమూరి నాగరత్నం, 65 సంవత్సరాలు, పిచ్చికలపూడి గ్రామానివాసి అయినట్ట్లు,కుటుంబ ఆదరణ లేక తాను చనిపోవాలని కాలవ లోకి దూకినట్ట్లు చెప్పినది.అంతట సదరు వృద్దురాలిని ఆమె బందువులకి అప్పగించినారు.
పోలీస్ అంటే తలపై టోపీ చేతిలో లాటి తప్పు చేసిన వారిని దండించడమే కాదు అవసరములో వున్నా వారికీ సాయం చేయడం, ఆపదలో వున్నా వారిని తన ప్రాణాలకు తెగించి కాపాడే సత్తా కలిగిన వ్యక్తి పోలీస్ సకాలంలో స్పందించి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒక వృద్దురాలి ప్రాణాలు కాపాడి పోలీసుల ఘనత చాటిన పామర్రు పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ. దుర్గారావు ని పలువురు అభినందిచారు. మరియు పామర్రు పోలీసు స్టేషన్ ఎస్‌ఐ పి.ప్రవీణ్ కుమార్ రెడ్డి .ఏఎస్‌ఐ ని ప్రత్యేకంగ అభినందిచారు.