Breaking News

లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ అందజేత

160 Views

 

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నాడు లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు మర్కంటి కనకయ్య తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని మానవ సేవే మాధవ సేవ అని సమాజ సేవ చేయడం కోసం లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజానికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షతో మొదటి ప్రయత్నం గా విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు,పెన్సిల్స్ అందజేయడం జరిగింది అని విద్యార్థులు శ్రద్ధతో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని పదవ తరగతి విద్యార్థులకు కీలక మలుపు అని విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని తల్లితండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అర్చన శివకుమార్, ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఎల్లేశం,16 వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాకని బిక్షపతి, 3 వ వార్డ్ అధ్యక్షులు శ్రీ రామ్ మల్లేశం,నాయకులు అర్థం మహేష్, రాజిబాబు,శ్రీనివాస్, బాబు,విద్యార్థిని విద్యార్థులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *