రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన డిఎస్పీగా బీమ్ సింగ్ గురువారం రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈయన వరంగల్ ఎస్బి ఏ సిపి గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల బదిలీ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. నిన్నటిదాకా విధులు నిర్వహించిన ఉదయ రెడ్డిని హైదరాబాద్ డిజిపి ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నూతనంగా వచ్చిన డిఎస్పీని స్థానిక పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
