మార్చ్ 30, 24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్…
పదవులు అనుభవించి, అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారు.
రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు.
ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారు.
కేసీఆర్ ను తప్పు పట్టే అర్హత కడియం కావ్యకు ఎక్కడిది?
కడియం కారణంగానే రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారు.
రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారు.
ఇన్నేళ్ల మీ అనుభవాన్ని మీ రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు.
మేము త్యాగాలు చేశాము, మీరు భోగాలు అనుభవించారు.
ఊసరవెల్లి, పాము కంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు.
భారాసలో అన్నీ అనుభవించి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లోకి పోతున్నారా?
మా పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్ళాలి.
చంద్రబాబు దర్శకత్వంలో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.
భారాస మీకు తీర్థయాత్ర లాగా కనిపిస్తుందా?
హైదరాబాద్ లో ఉన్న చెడ్డీ గ్యాంగ్ ల తరహాలో పార్టీలు మారే నేతలు కనిపిస్తున్నారు.
వయసు పెరిగిన ప్రతి వారు మేధావి అనుకుంటే సరిపోదు,
మీరు అంతా స్వార్థపరులు
కడియం లాంటి వారి వల్ల జాతికి ఎలాంటి లాభం లేదన్న మందకృష్ణ వ్యాఖ్యలు నిజం
ఇలాంటి వ్యక్తులను రాళ్లతో కొట్టినా పాపం లేదు
పార్టీలు మారే వారి విషయంలో ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు సమాధానం చెప్పాలి
పదవులకు రాజీనామా చేయకపోతే ఇండ్ల ముందు సావు డప్పులు ఉంటాయి, ప్రజలు రాళ్లతో కొడతారు
చెప్పిన మాటలను సీఎం అమలు చేయాలి… లేదంటే ప్రజలు చేస్తారు
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి
మా లాంటి వాళ్ళం నష్ట పోయాం… మీరు నష్టపోవద్దు
తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు
కేశవరావుకు భారాస ఏం తక్కువ చేసింది?
బిడ్డల రాజకీయ జీవితం కోసం ఇద్దరు నేతలు బుడ్డెర ఖాన్ లలా మారారు
ఇటువంటి వ్యతిరేక శక్తులు, ద్రోహులు ఎక్కడ పోటీ చేసినా ఉద్యమకారులు, నేతలు, కార్యకర్తలు ఓడించాలి
కేసీఆర్ అవకాశం ఇస్తే వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తాను.