బొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని చుంచనకోట గ్రామ పంచాయతీ కార్యదర్శి వినతి పత్రం
నవంబర్ 14
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేర్యాల మున్సిపల్ ఆఫీసులో వినతి పత్రాన్ని అందచేశారు.
ప్రజలంతా కంపెనీ యాజమాన్యం కు ఫ్యాక్టరీ మూసివేయాలని తెలిపిన తమ పలుకుబడితో కప్పిపెట్టుకుంటున్నారని మాకు న్యాయం జరగడం లేదు అని ఈ కంపెనీలో ఇతర రాష్ట్రాలకు చెందిన మైనర్ పిల్లలతో పనులు చేస్తూ మాఫియాను నడుపుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని త్వరగా బొక్కల ఫ్యాక్టరీని మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు.
ఈ కార్యక్రమంలో చుంచనకోట గ్రామ కార్యదర్శి రాజు సుతారి రమేష్ బంగారు చందు బింగి నరసింహులు ఇమ్మడి రాజు గుడ్ల మహేందర్ పండుగ యాదగిరి బంగారి భాను ఆది వెంకటేశం గ్రామంలోని యువకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు
