మంచిర్యాల పట్టణంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే అన్ని జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మంచిర్యాల పట్టణంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో మా ఆకాంక్షను గుర్తించి ప్రభుత్వం త్వరితగతిన స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బీసీ కుల సంఘాలను సంఘటితం చేసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం మనీ తెలియజేస్తూనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ ,కొంతం రాజు జిల్లా నాయకులు జైపాల్ సింగ్ , పట్టణ అధ్యక్షులు బోడెంకి మహేష్ , నాయకులు అంకం సతీష్ , అరేందుల రాజేశం , తదితరులు పాల్గొన్నారు .
