జనగామ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న
నవంబర్ 14
సిద్దిపేట జిల్లా చేర్యాల జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అని, నేతాజీ ఆశయ సాధన కోసం,జనగామ ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఫార్వర్డ్ బ్లాక్ గా మద్దతిస్తున్నామని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందే బీరన్న అన్నారు.
ఈ కార్యక్రమంలో అందె బీరన్న మాట్లాడుతు…. గత 30 సంవత్సరాలుగా జనగామ ప్రాంతంలో అనేక రకాల ఉద్యమాలతో ప్రజల పార్టీగా గుర్తింపు పొందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు ప్రాంత అభివృద్ధి కోసం ఇండియా కూటమిలో భాగంగా జనగామ ప్రాంతంలో మద్దతిస్తున్నామని అన్నారు.
చేర్యాల రెవిన్యూ డివిజన్ కోసం గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటంపై గెలిస్తే ఇస్తానన్నా కేసీఆర్ మాటలు ఉత్త మాటలే కాబట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని గుర్తించి జనగామ ప్రాంత అభివృద్ధి కోసం ఫార్వర్డ్ బ్లాక్ గా మద్దతిస్తున్నామని అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు, నేతాజీ అభిమానులు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు పాకాల ఇసాక్, స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు, ఫార్వర్డ్ బ్లాక్ మద్దూరు మండల నాయకులు ఆనందం, బొంగురం వెంకటేష్ రెడ్డి,ఎర్రోళ్ల అఖిల్, వెల్దీ సాయికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





