నిర్మల్ నవంబర్ 14 :కన్నుల పండుగగా ప్రచారం.అడుగు అడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు.
మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్వరం మండలంలోని జోర్ పూర్ గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను దశలవారీగా పెంచుతూ 5000 వరకు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. అలాగే రైతుబంధు పథకం ని కూడా 5000 నుంచి దశలవారీగా 8000 వరకు ఎకరాకు పెంచుతామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఒక మేనమామ కట్నం లాగా ఒక లక్ష పదహారు రూపాయలను ఇస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.