ఎల్లారెడ్డిపేట మండలం :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12
ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రోడ్డ రామచంద్రం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని మార్చాలి అనటం అవివేకం అన్నారు కెసిఆర్ పరిపాలన దొరల పరిపాలన గా మారిందన్నారు ప్రపంచ దేశాలు భారతదేశ రాజ్యాంగం వైపు చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి అనటం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య గ్రామస్తులు మంత్రి శ్రీనివాస్ పంతంగి ఆగయ్య తాళ్ల పెళ్లి అంజయ్య ఎస్ కె మోదీ రంగయ్య గౌడ్ బాబు తదితరులు పాల్గొన్నారు





