రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామీణ ప్రాంత మహిళలకు నాబార్డ్ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు నేషనల్ అగ్రికల్చర్ బ్యాంకింగ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ వారి సౌజన్యంతో గంభీరావుపేట మండల కేంద్రంలో మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో ఉచితంగా శిక్షణ పక్షం రోజులపాటు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులతో పాటు గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శిక్షణను సద్విని యోగం చేసుకొని జీవితంలో ఈ శిక్షణతో ఆసరా పొందాలని గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు తెలిపారు .
