రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో సోమవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా రైతులందరికీ 12 విడత 2000 రూపాయలు రైతుల అకౌంట్లో సోమవారం జమ చేయనున్న సందర్భంగా తెలంగాణా స్తూపం వద్ద మోడీ చిత్రపటానికి రైతులతో కలిసిపాలాభిషేకం చేశారు .ఈ సమావేశంలో మండల అధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు నమ్మాలిలక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను చేయనందుకు మిమ్మల్ని నమ్మాలా వ్యవసాయ సబ్సిడీలు ఎత్తివేసినందుకు రైతులు మిమ్ములను నమ్మాలా.రాష్ట్రంలో పిఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనందుకు మిమ్మల్ని నమ్మాలా భూసార పరీక్షల కోసం 300 కోట్లు ఇస్తే దారి మల్లించినందు మిమ్ములను నమ్మాలా అని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక యూరియా బస్తా పైన 95% సబ్సిడీ అలాగే దుక్కి మందు పైన 50% సబ్సిడీ ఇస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతులు బాల మల్లయ్య గుడికాడ బాలయ్య పెద్దవేని చిన్న మల్లయ్య కొక్కు రాములు బిజెపి నాయకులు పత్తి స్వామి రాజ్ రాజు గౌడ్ రాజిరెడ్డి నాగరాజుగౌడ్ విగ్నేష్ దేవరాజు లక్ష్మీనారాయణ దేవరాజు నరేష్ తిరుపతి రమేష్ నాయకులు పాల్గొన్నారు.
