ముస్తాబాద్, సెప్టెంబర్28, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ముస్తాబాద్ మండలకేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరి చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఈసందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద బిఆర్ఎస్ నాయకులు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణానికి10కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం మంత్రి కేటీఆర్ తోనే సాధ్యమైందని ప్రజలకు ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండాలని రాష్ట్రాన్ని సుభిక్ష అభివృద్ధి దిశగా నడుస్తుందన్నారు. ఉత్తర్వులు జారీ చేయడంపై బిఆర్ఎస్ నాయకులు,స్థానికులు టపాసులు పేల్చి హర్షంవ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, సర్వర్ భాష, కొండ శ్రీనివాస్ గౌడ్, కంచంనర్సింలు, శ్రీనివాస్ రావు, మెంగని మనోహర్, శీలంస్వామి, కోడె శ్రీనివాస్, పరిధిపేట వెంకటేష్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
