చొప్పదండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన కరీంనగర్ పోలీస్ పరిశీలకులు అదనపు డీజీపీ సతీష్ గణేష్.
నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోప్పందండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు జిల్లా ఎస్పీ ని అడిగి తెలుసుకున్నారు.
గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని,విలేజ్ పోలీస్ అధికారి తరచు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా కృషి చేయడం జరుగుతుందని,క్రిటికల్ గ్రామాల్లో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ కరీంనగర్ పోలీస్ పరిశీలకులకు వివరించారు.
