ప్రకటనలు

బిఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

319 Views

బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు., ప్రస్థుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు తుల ఉమ నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కె.తారక రామారావు తో వారి ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం, తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బిజెపి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, బిఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరం. ఇది మహిళలకే కాకుండా బిసి ల పట్ల బిజెపి వ్యతిరేక వైఖరికి నిదర్శనం. బిసి ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బిజెపి పార్టీ., తెలంగాణ ఉద్యమ కాలం నాటినుంచి సీనియర్ మహిళా నాయకురాలుగా, నాడు సిఎం కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ ఆడ బిడ్డగా బిఆర్ఎస్ పార్టీ ఇంటిబిడ్డగా తన సేవలందించిన తుల ఉమక్క కు బిజెపి ఇటువంటి అవమానం జరగడం బాధగా వున్నది. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని మీము తీవ్రంగా ఖండిస్తున్నాము..నిరసిస్తున్నాము.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *