నవంబర్ 13
24/7 తెలుగు న్యూస్
నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు.
తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
