(మానకొండూర్ మార్చి 31)
తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు పార్టీని విడిచి పేట్టి పోతున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లోనీ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువజన విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తులలో వినోద్ కుమార్ అని అన్నారు.
పార్లమెంట్ లో తెలంగాణ,కరీంనగర్ కోసం అనేక సమస్యల మీద మాట్లాడి వాటిని అమలు చేసే దిశగా అనేక పోరాటాలు చేశారని అన్నారు.
యువకులంతా ముఖ్యమంత్రి కి లేటర్ల ద్వారా రేవంత్ రెడ్డి నీ ఒక్కసారి జై తెలంగాణ అనలని అమరవీరుల స్థూపానికి నివాళులు నివాళులు అర్పించేల చేయాలని సూచించారు జై తెలంగాణా అని ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి అనలేదని విమర్శించారు .
వినోద్ కుమార్ మాట్లాడుతూ..
10 ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఅర్ హయాంలో పల్లెలన్నీ పచ్చగా ఉండేవని ఎర్రటి ఎండాకాలంలో కూడా చెరువులు రిండి మత్తల్లు దుకేవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటలు బిడులు పారి ఎండిపోతున్నాయని అన్నారు..
రైతులను అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని,మతం దేవుళ్ల పేరు చెప్పే బిజెపిని కూడా ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా గెలుపు కొరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,బీఆర్ఎస్ పార్టి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామక్రిష్ణ రావు, బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసిలు ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు