హైదరాబాద్‌లోని నాంపల్లి కెమికల్ గోడౌన్లో ఈరోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
సోమవారం ఉదయం బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు నాలుగు అంతస్తుల వరకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది.
దీంతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ల సాయంతో అక్కడకు చేరుకున్నారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
