రాజకీయం

నేటి నుండి నామినేషన్ వేసిన అభ్యర్థుల పత్రాల పరిశీలన

179 Views

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్‌లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఆర్వోలు పరిశీలించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్‌లు దాఖలయ్యాయి.ఈ మొత్తం నామినేషన్‌ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు.

అదేవిధంగా ఈ నెల 15 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు ఉన్నది. కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థు ఆరోజు వరకు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. ఈ నామినేషన్‌ ఉపసంహరణ కూడా పూర్తయితే ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది కచ్చితంగా తేలనుంది.

కాగా, తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేరోజు పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *