దౌల్తాబాద్ మండల సీఐటీయూ సమావేశం నిర్వహించి అనంతరం 2022 డిసెంబర్ 21,22,23 సిద్దిపేటలో జరిగే CITU తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU *జిల్లా కోశాధికారి జి. భాస్కర్* మాట్లాడుతూ
కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ సిఐటియు సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సిద్ధిపేట పట్టణంలో 2022 డిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని, 23న జరిగే బహిరంగసభ ముఖ్యతిథిగా కేరళ రాష్ట్ర కార్మికశాఖ మాత్యులు కామ్రేడ్ వి.శివన్ కుట్టి గారు హాజరవుతున్నారని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు,మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను, ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, కార్మిక హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రోజుకు రూ॥ 178/- ఉండాలని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వ ప్రకటించడం, గ్యాస్,పెట్రోల్,డీజిల్,నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందని,విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమలో కనీస వేతనాల పెంపుదల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.తదితర రంగాల కార్మికుల్లో వస్తున్న సమస్యలపై సిఐటియు పోరాడుతుందనీ,ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందనీ, బహిరంగసభ ర్యాలీ కాంచిట్ చౌరస్తా హైస్కూల్ నుండి ర్యాలీ మధ్యాహ్నం 1-0 0గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. కావునా జిల్లాలోని కార్మికవర్గం,ఉద్యోగ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో CITU కార్మికులు భాలరాజ్,రాములు, నాగరాజు, మహేష్, స్వామీ, అనీల్, లక్ష్మీ, బాలమని, నర్శవ్వ, లలిత, కనకవ్వ, తదితరులు పాల్గొన్నారు.
