వీర్నపల్లి మండలంలోని రెండు ఆవులపై చిరుత దాడి చేసి మతమార్చింది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్ది తండా గ్రామానికి చెందిన భూక్య మురళి అనే వ్యక్తికి సంబంధించిన రెండు ఆవులు పై శనివారం రాత్రి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం భూక్య మురళి తన ఆవులను వెతుక్కుంటూ కొట్టం వద్దకు వెళ్లగా పులి దాడిలో మృతి చెందాలని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆవులను పంచనామా చేశారు. రాత్రి వేళల్లో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలిపారు.
