మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ అన్నారు.మైనార్టీ ల సంక్షేమం కోసం నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేటాయిస్తుందని అన్నారు.వక్ఫ్ బోర్డు ఆస్తులు బిఆర్ ఎస్ పార్టీ వారు అన్యాక్రాతం చేశారని అన్నారు.
మైనార్టీ కి చెందిన వారి పిల్లలు పీజీ,డిగ్రీ,ఇంటర్,పదవ తరగతి చదువుకున్న వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తామని అన్నారు. మౌజమ్ లకు ప్రతి నెల పది వేల నుండి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. క్రిస్టియన్,మైనార్టీ,సిక్కుల కోసం స్మశాన వాటిక లను నిర్మిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే గౌస్,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్,జహంగీర్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మా రెడ్డి, కోమిరిశేట్టి తిరుపతి,ఒగ్గు బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




