Breaking News

సమావేశం నిర్వహించడం జరిగింది

138 Views

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది..

అక్టోబర్ 13

ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 25 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ఇవ్వడం జరిగిందని ఈ యొక్క దసరా సెలవులలో విద్యార్థులను ఒత్తిడికి, ఇబ్బందులకు గురిచేస్తూ నగరం లో పాఠశాలలు నడిపే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, పాఠశాల ముందు ధర్నా నిర్వహించి,  డి ఈ ఓ  దృష్టికి తీసుకెళ్లి గుర్తింపు రద్దు చేసేంత వరకు ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు…కావున ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కకుండా పాఠశాలలకు సెలవులను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఏవైనా యాజమాన్యాలు పాఠశాలలను నిర్వహిస్తే 8367078206,7799554460, 9908292877 ఫోన్ నెంబర్స్ కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పవన్, నగర సంయుక్త కార్యదర్శి సంతోష్,సంజయ్,రాకేష్,ఉదయ్, వెంకట్ కుశాల్,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *