Breaking News

సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి*

149 Views

సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి*

 

ఈరోజు సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి,  మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ ని కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మేడమ్  నూతన ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు.

 

కేతిరెడ్డి సురేందర్ రెడ్డి 1998 సంవత్సరంలో ఎస్ఐ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో అరంగేట్రం చేసి ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేశారు, 2010 సంవత్సరంలో సీఐ గా ప్రమోషన్ పొంది ఉమ్మడి మెదక్ జిల్లా, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలో పనిచేశారు. ఈ సంవత్సరం 22-06-2023 ప్రమోషన్ పొంది ఈరోజు సిద్దిపేట నూతన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు.

 

ఈ సందర్భంగా ఏసిపి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవలు అందిస్తామని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *