ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన
డా జి సత్యనారాయణ స్వామి
:
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిర్వహణ పరీక్షల కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి రిబ్బన్ కత్తిరించి సోమవారం ప్రారంభించారు,
ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల కోఆర్డినేటర్ నిరంజన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు ఇప్పటివరకు 244 కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు , ఈ కంటి పరీక్షల కేంద్రం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తామన్నారు , కంటి అద్దాలు అవసరం ఉన్నవారు మాత్రం కొనుగోలు చేసుకోవాలని, అవసరమైతేనే కంటి ఆపరేషన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్వి ప్రసాద్ కంటి వైద్య శాలకు రెఫర్ చేస్తామన్నారు, పెళ్లి అపుతాల్ మజీద్ ద్వారా హైదరాబాదులోని కంటి వైద్య నిపుణులతో సలహా సూచనల తీసుకొని అర్హులైన పేదవారికి ఉచిత ఆపరేషన్లు చేయబడతాయని చెప్పారు , ఈ కేంద్రం ద్వారా కంటికి సంబంధించిన 60 శాతం సమస్యలను పరిష్కరిస్తామన్నారు, కంటి సమస్యలతో ఎవరు కూడా బాధపడవద్దని ఉద్దేశంతో నిరుపేదలకు అందుబాటులో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో
ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని సిరిసిల్ల డివిజన్ లో ఇల్లంతకుంట, గంభీరావుపేట మండలాల్లో కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు, బిపి షుగర్లతో బాధపడే వారు ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేసుకోవాలని ఆయన కోరారు ,
30 , 40 సంవత్సరాల వయస్సు దాటిన వారు సంవత్సరాలనుకోసారి కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు ,
ఎస్ ఎస్ సి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన యువతి యువకులు ఆప్తల్ మజీ నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులు డిజైన్ టెక్నీషియన్ ఉచిత ఉచితంగా కోర్సులు ఇవ్వబడునని ఆసక్తి కలిగిన యువతీ యువకులు 7386968111 డాక్టర్ అన్వేష్ ను సంప్రదించాలని దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు
కంటి పరీక్షల నిర్వహణ కేంద్రంలో ఆధునిక పరికరాలను బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారు బాల్ రెడ్డి, బిజెపి నాయకులు సత్యం రెడ్డి , ఆర్ ఎం పి బందారపు పరమేశ్వర రెడ్డి లు ప్రారంభించారు,
ఈ కార్యక్రమం మిషన్ ఫర్ విజన్ .హాకారంతో ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి నరేష్ రావు , మెన్ గివింగ్ పౌండేషన్ నిర్వాహకులు జై కుమార్ , అన్వేష్ కృష్ణ , శ్రీను తదితరులు పాల్గొన్నారు
