రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని ముస్తాపనగర్ గ్రామం లో శనివారం ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు శివంది నారాయణ ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పెద్దమ్మ గుడి ప్రాంగణం లో మండల శాఖ అధ్యక్షుడు వీరబోయిన రమేష్ అధ్యక్షతన ముదిరాజ్ గర్జన జరిగింది ముఖ్య అతిదిగా విచ్చేసిన బీసీ సంక్షేమ రాష్ట్ర అధికార ప్రతినిది పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ నక్సలైట్ మరియు తెలంగాణా ఉద్యమ త్యాగాల ముదిరాజ్ లకి అగ్రస్థానమన్నాడు ప్రాణ త్యాగాల చరిత్ర చాలని ఇక శాసించె చరిత్ర కావాలి అన్నారు రాష్టంలో 14% జనాభా 50 లక్షలమంది ముదిరాజ్ లు ఉన్నారని చట్ట సభలలో మాత్రం ప్రాతినిధ్యంఒక్క శాతం కూడా లేరన్నారు 50యంఎమ్ స్థానాలు గెలుపోటములను ప్రభావం చూపుతారని ఇప్పటికైనఅన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలల్లో ముదిరాజ్ లకు 17 అసెంబ్లీ 2ఎం పి స్థానాలు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిది పర్శ హన్మాండ్లు డిమాండ్ చేశాడు ముదిరాజ్ లను బీసీ ‘ డి ‘ గ్రూప్ నుండి బీసీ ‘ఎ ‘ గ్రూప్ కు మార్చాలని అదేవిదంగా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించాలని కోరారు మళ్ళీ వచ్చేది కూడా టీఆర్ ఎస్ ప్రభుత్వం మని సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు అదృష్ట వంతులని భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ అని పర్శహన్మాండ్లు అన్నాడు ముదిరాజ్ లకు టిఆర్ ఎస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పర్శ హన్మాండ్లు విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమం లో తెలంగాణా ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు కోడి అంతయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య , జిల్లా కన్వీనర్ ఆర్ లక్ష్మణ్ గంభీరావుపేటమండలకార్యదర్శులు వీరబోయిన రమేష్ , ఛత్రబోయిన లక్ష్మణ్ , మార్కెట్ కమిటీ చేర్మెన్ సుతారి బాలవ్వ రైతు బందు సమన్వయ సమితి అధ్యక్షుడు ధ్యానబోయిన రాజేందర్ , స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకట్ స్వామి , మాత్స్య మార్కెటింగ్ సంఘం చేర్మెన్ నాగరపు దేవేందర్ , యూత్ అధ్యక్షుడు సంజీవ్ , నాయకులు శివంది దేవేందర్ పిట్ల శ్రీమతి ప్రతాప్ శివయ్య, బాల్ రాజ్ , రమేష్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
