ప్రాంతీయం

ఘనంగా స్వయంపాలన దినోత్సవం – పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజియా తబస్సుమ్

832 Views

స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. శుక్రవారం రాయపోల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్ పాఠశాలలో స్వయం స్వపరి పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్ మాట్లాడుతు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర వహించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాటలు బోధించడం జరిగిందన్నారు. దీనివల్ల నిజ జీవితంలో కూడా సమాజంలో ఏ విధంగా ఉండాలనే విషయంలో స్వీయ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందని తెలిపారు. విద్యార్థులు అందరూ వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులకు వారి పై చదువులకు తొలిమెట్టుగా భావించి కష్టపడి చదివి పాఠశాలకు మరియు వారి తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చే విధంగా అందరు ఉత్తీర్ణులు కావాలని పాఠశాల పేరు చిరస్థాయిగా నిలపాలని తెలియజేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలపై ముఖ్య ప్రదర్శనలు, అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *