ముస్తాబాద్/అక్టోబర్/16; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం చిన్న కుంటలో వేలసంఖ్యలో చేపలు చనిపోయి ఉన్నాయి… చేపలు చనిపోయి దరికి చేరుతుండడంతో చెరువులో విషప్రయోగం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని బంధనకల్ గ్రామానికి చెందిన ఏఎంసి చైర్మన్ ముదిరాజ్ చిగురు నరేష్ వాపోయాడు. చిగురి నరేష్ మాట్లాడుతూ మాఅన్న కేటీఆర్ సూచనల మేరకు మునుగోడులో ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి తాను వెల్లగా ఇదే అదును చూసుకుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారని నరేష్ కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలలో ఉండిపోయారు. నరేష్ మాట్లాడుతూ నేను ఎవరికి అన్యాయం చేయలేదు… ఇలాంటి దుశ్చర్యలకు ఎందుకు పాల్పడ్డారు నాకేం అర్థంకాలేదు నేనురోజు ఉదయాన్నే చేపలను చూసుకుంటూ ఎంతో సంతోషపడేది ఈసంతోషాన్ని బుగ్గి పాలుచేశారు నాతోపాటు ఈబాధను మాఅమ్మ ఒడ్డున కూర్చుండి చనిపోయిన చేపలను చూసుకుంటూ జీర్ణించుకోలేక పోతుంది. వీరి బాధను బంధనకల్ గ్రామస్తులందర్నీ కల్చివేసింది ఇలా నన్ను నష్టపరిస్తే మీకేమైనా లాభం వచ్చిందా ఇలాంటి దౌర్భాగ్య పనులు నాకే కాదు ఇంకేవరికి చేయొద్దని తనబాధ బిగ్గ పట్టుకొని చివరినరేష్ ఈవిధంగా తెలిపారు.
